Rains | ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా ముసురు కురుస్తున్నది. దీంతో చలి తీవ్రత పెరుగడంతో కొందరు జనం ఇండ్లకే పరిమితమయ్యారు.
పలు పల్లెల్లో రోడ్లు బురదమయంగా మారాయి. చేతికొచ్చిన పత్తి, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లుతున్నదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.