సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి అంచనాను బట్టి జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌లోకి 1000 క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి 884 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌లోకి 2500 క్యూసెక్కుల నీరు వస్తుండగా..ఆరు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 2035 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు రిజర్వాయర్ల ద్వారా 2919 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తుండగా, మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.