రంగారెడ్డి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతోపాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో 109 అర్బన్ ఫారెస్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించగా.
ఇప్పటివ రకు 73 ఫారెస్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చి అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అద్భుతంగా తీర్చిదిద్దిన చిలుకూరు ఫారెస్ట్ ట్రెక్ పార్కు సహజ సిద్ధ మైన ఎన్నో అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తున్నది. ట్రెక్కింగ్, ట్రీైక్లెంబింగ్, బర్డ్‌వాక్, అడవిలో క్యాంప్ ఫైర్, క్యాంపింగ్ టెంట్.. వసతులతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతిని కలిగిస్తున్నది.
ఉరుకులు పరుగుల జీవితంలో వారాంతంలో ఉల్లా సం కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. ఇంటిల్లిపాది తో కలిసి అలా.. విహారానికి వెళ్తే కలిగే ఆ ఆనందమే వేరు. అయితే..టూర్ ప్లాన్ అనగానే.. ఎక్కడికి !.. ఎలా?..అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లి రావడానికి.. ఓ రోజంతా ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు చిలుకూరు ట్రెక్ పార్కు దోహదపడుతున్నది. పెద్ద, పెద్ద నగరాల్లో ఉన్న పార్కులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కొత్త పర్యాటక ఆకర్షణల తో ఈ పార్కును తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
మనసును ఆహ్లాదపరిచే వాతావరణం.. మండుటెండల్లో సేదతీర్చే పచ్చని చెట్లు..కొండలు..కోనలు.. చెక్డ్యాంలలోని జలపా తాలు వాటిపై వంతెనలు..నేలపై పరుచుకున్న గ్రీన రీ.. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఎత్తైన గుట్టలపై ఏర్పాటు చేసిన గోడలు.. ఇలా ఎన్నెన్నో అందా లు అచ్చంగా అడవుల్లో ఉన్న అనుభూతిని ఈ పా ర్కు కలిగిస్తున్నది. యోగా.. వాకింగ్ ట్రాక్‌లతో ఆరోగ్యానికి ఉపయోగపడే వసతులతోపాటు.. చిన్నపిల్లలను మంత్రముగ్ధులను చేసే ఎన్నో ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి.
నామమాత్రపు ప్రవేశ రుసుం తప్ప వేరే ఖర్చులు లేకపోవడంతో హైదరాబాద్‌తోపాటు చు ట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, సందర్శకులు పెద్ద ఎత్తున ఈ పార్కుకు వచ్చి మంత్రముగ్ధులవుతున్నారు. వేల రూపాయలు వెచ్చించి దూరప్రాంతాల కు వెళ్లకుండానే.. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాదీ.. ఇక్కడే హాయిగా వినోదాల్లో ముగిని తేలవచ్చు.
ఇటీవల అధికారులు అందుబాటులోకి తెచ్చిన నేచర్ క్యాంపునకు విశేష స్పందన వస్తున్నది. ఎక్కడా పర్యావరణానికి హాని కలుగకుండా.. ట్రెక్కింగ్, రా త్రి గుడారాల్లో బస చేయడం, లాంతర్ల సాయంతో రాత్రి విహారం, వేకువజామున పక్షుల కిలకిలారావాలను ప్రత్యక్షంగా చూడడం, సాహస కార్యక్రమాల్లో భాగంగా రివర్ క్రాసింగ్, చెట్లు ఎక్కడం వంటి కార్యక్రమాలను నిర్వహించి జీవితానికి సరిపడా అనుభూతిని ఈ క్యాంపు ద్వారా కల్పిస్తున్నారు. ఇక్కడి నేచర్ క్యాంపునకు వస్తున్న ఆదరణను చూసి పలు అడవుల్లోనూ ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.