బొంరాస్‌పేట, డిసెంబర్ 22 : ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా గురువారం మండలంలోని పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. చెట్టుపల్లితండా కేజీబీవీ, చిల్ముల్మైలారం యూపీఎస్, ఎనికేపల్లి యూపీఎస్, బొంరాస్‌పేట ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామానుజం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. కేజీబీవీ పాఠశాలలో గణితానికి సంబంధించిన అంశాలు అర్థమయ్యే విధంగా విద్యార్థినులు కృత్యా లు తయారు చేసి ప్రదర్శించారు. కూడికలు, తీసివేతలు సులభంగా అర్థమయ్యే రీతిలో చిన్న నాటిక ద్వారా వివరించారు. క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.చిల్ముల్మైలారంలో గణితమేళాను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డి, కేజీబీవీ ఎస్వో రాధిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు శ్రీహరిరెడ్డి, నెహ్రూచౌహాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో కూడా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు.
దోమ, డిసెంబర్ 22 : మండల పరిధిలోని బడెంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురు వారం విద్యార్థులు మ్యాథ్స్ మేళాను నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామా నుజన్ జయంతిని పురస్కరించుకుని గణిత శాస్ర్తానికి సంబంధించి వివిధ పరికరాలను తయారు చేసి మేళాలో ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవితాశ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఎం కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ధారూరు, డిసెంబర్ 22: మండల పరిధిలోని కుక్కింద జడ్పీ ఉన్నత పాఠ శాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ శ్రీనివాస రామా నుజాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవర్ధన్‌రెడ్డి, శివప్రసాద్, సంతోశ్, మల్లికార్జున్, కమాల్ రెడ్డి, నర్సింహులు వెంకటయ్య, రాజు, రవి పాల్గొన్నారు.
కోట్‌పల్లి, డిసెంబర్ 22: ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి కలిగి ఉండాలని బార్వాద్ జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకటరత్నం అన్నారు. గురు వారం గణిత దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గణి తంపై దృష్టి సారించి బాలమేధావులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, రామచందర్, రాజశేఖర్, విజయ్, ఫారుక్ పాల్గొన్నారు.
పెద్దేముల్, డిసెంబర్ 22: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠ శాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మ్యాథ్స్ డేలో పాఠశాలకు చెందిన ఆయా తరగతుల విద్యార్థులు గణిత శాస్ర్తానికి సంబంధించి సుమారు 36 రకాల గణిత ప్రదర్శనలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.