ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం సజావుగా సాగా యి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్.. మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ జరిగిం ది. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సెంటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లను అధికారులు మూయించారు. రంగారెడ్డి జిల్లాలో 90 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 56,883 మందికి సుమారు 27,000 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాశా రు. హాజరు శాతం 42గా నమోదైంది.
ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలోని కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఎనిమిది మంది అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్లారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం అభ్యర్థులు 10,381 మంది కాగా హాజరు శాతం 53గా నమోదైంది. పరిగిలోని విజ్ఞాన్ జూనియర్, పల్లవి డిగ్రీ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించి పరిశీలించారు.