చిలిపిచెడ్ ,మార్చి 2 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలో భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండలంలోని చండూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శేఖర్‌కు రెండెకరాలు ఉండగా.. పక్కన ఉన్న ఓ రైతు దగ్గర మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు 720 ఫీట్లు వేసిన ఫలితం శూన్యం అయింది. దీంతో అప్పులపాలయ్యాడు.
చిలిపిచెడ్ మండలంలోని గుజిరి తండాకు చెందిన మరో గిరిజన రైతు భన్సీలాల్ 700 ఫీట్లు వేసిన ఫలితం లేకపోయింది.చిలిపిచెడ్ మండలం నుంచి పలు గ్రామాల శివారులకు ఆనుకొని సింగూర్ నుంచి నిజాంసాగర్‌కు మంజీరా నది ప్రవహిస్తున్న ఏం ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రైతు 720 ఫీట్లు బోరు వేసినా చుక్క నీరు రాలేదు. దుమ్మే రావడంతో రైతన్నకు నిరాశే మిగిలింది. మండలంలోని గంగారం, చండూర్ గ్రామాల్లో ఎత్తిపోతల ప్రాజెక్టు ఉన్న రైతులకు ఫలితం లేదని రైతులు నిరాశ చెందారు. ఇప్పటికైనా చండూర్, గంగారం ఎత్తిపోతల ప్రాజెక్టు(లిప్ట్)కు మరమ్మతులు చేసి రైతులు పంటకు నీరు అందించాలని రైతులు జిల్లా కలెక్టర్, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.