ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఉంచి లయబద్ధంగా చప్పట్లతో ఆడపడుచులు పాడిన పాటలు అలరింపజేశాయి. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ ఆడబిడ్డలు ఆడిపాడారు. చిన్నాపెద్ద పటాకులు కాల్చుతూ సందడి చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లు, బాజాభజంత్రీలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకువెళ్లి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు.