Malreddy Rangareddy | ఆదిభట్ల, ఫిబ్రవరి 13: తమ నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని మహమ్మాయిదేవిని వేడుకున్నానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి మహమ్మాయి దేవి రథోత్సవంలో ఆయన పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మాయిదేవి ఆలయం వందల ఏండ్ల నుంచి ప్రజల నుండి పూజలు అందుకుంటుందని అన్నారు.
ఇబ్రహీంపట్నం ప్రజలు మహమ్మాయిదేవి ఉత్సవాలలో ప్రతి ఏటా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ చనమోని సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ భూపతి గళ్ళ మైపాల్, నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌని బాలరాజు గౌడ్, నాయకులు చెనమోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.