ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 31 : కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2025 నూతన సంవత్సరానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచే సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు నడుమ కేకులు కట్ చేసి కొత్త సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానించారు. కండ్ల ముందే మరో ఏడాది కరిగిపోయింది. జిల్లాలోని బేకరీలు, స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. విద్యార్థినీవిద్యా ర్థులు, యువత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. 2024కి.. బై బై..చెబుతూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు
కాలగమనంలో మరో ఏడాది కలిసిపోయింది. నేటి నుంచి కొత్త సంవత్సరానికి అంకురార్పణ జరిగింది. నూతన ఏడాదిని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.