గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గ్రేస్-స్క్రీన్ ఫర్ లైఫ్’ అనే థీమ్‌తో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ‘గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్-2024’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే పరీక్షలు చేసి కట్టడి చేయవచ్చని అన్నారు.
అంతకు ముందు యూస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, గీవ్ లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బార్డ్ ఫీషర్ 10కే, 5కే, 2కే రన్లను జెండాలు ఊపి ప్రారంభించారు. నగరంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దాదాపు 20 వేల మంది ఈ రన్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులు, మహిళల కేటగిరీల్లో విజేతలైన వారికి మంత్రి బహుమతులు, మెడల్స్ అందజేశారు.
– శేరి లింగంపల్లి, అక్టోబర్ 6