తుర్కయంజాల్, ఏప్రిల్ 18 : తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి మునగనూర్ టెలిఫోన్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాంకు ఢిల్లీకి చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. గురువారం రాత్రి హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందజేసినట్లు లచ్చిరాం తెలిపారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ మహిళ సాధికారత, సామాజిక సేవ అంశంలో డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.