షాబాద్, జూన్ 14: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామం లో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోహెడలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రభుత్వ సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
శంకర్పల్లి : మహరాజ్పేట్ గ్రామంలో సర్పంచ్ నర్సింహారెడ్డి ఆధర్యంలో అంగన్వాడీ కేంద్రం వారు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి రమ్య, ఉపాధ్యాయులు తాహేర్ అలీ తదితరులు పాల్గొన్నారు
కడ్తాల్ : మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం యాద య్య, ఉపాధ్యాయులు ధనుంజయ్య పాల్గొన్నారు.
కడ్తాల్ : బడీడు పిల్లల పేర్లను నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయులు.