షాద్‌నగర్‌టౌన్, జూన్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని షాద్‌నగర్‌లోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ అన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో శనివారం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మనోహర్, శ్రీలక్ష్మి, ప్రమీల, రాజశేఖర్, అరుంధతి పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండలంలోని గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నది. శనివారం మండలంలోని జోగమ్మగూడెం, రామేశ్వరం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యా బోధన, మౌలిక వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.
బడీడు పిల్లలందరినీ
అబ్దుల్లాపూర్‌మెట్ : బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని ఎంపీపీ బుర్ర రేఖ అన్నారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన బడి బాట కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, ఎంఈవో వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కరపత్రాలు పంచి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు లేకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యనందిస్తారని తెలిపారు. పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాంలు, మధ్యాహ్న భోజన వసతులను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందన్నారు.
పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఉందని వారు తెలిపారు. ఎంపీటీసీ భాస్కర్‌గౌడ్, మండల కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్‌పాషా, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, నాయకులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాలల చైర్మన్లు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
పెద్దఅంబర్‌పేట : సర్కారు బడిలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, పిల్లలను బడికి పంపాలని ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి అన్నారు. మున్సిపాలిటీ పరిధి పసుమాములలోని ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో బడిబాట నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
యాచారం : మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మూడోరోజు కొనసాగింది. మేడిపల్లి, నందివనపర్తి, చింతపట్ల తదితర గ్రామాల్లో శనివారం ఉపాధ్యాయులు, గ్రామస్తులు బడిబాట ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కరపత్రాలను పంచారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలతో పాటు మెరుగైన విద్యను అందించనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఏవీఆర్ శాస్త్రీ, ఉపాధ్యాయులు బోజయ్య, పద్మశ్రీ, పద్మలత, వెంకట్‌రెడ్డి, కిషన్, అరుణ ఉన్నారు.