కడ్తాల్, డిసెంబర్ 24 : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గడ్డమీదితండాలో ఏర్పాటు చేసిన జీపీఎల్-5 క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక నాయకులతో కలిసి జడ్పీటీసీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలతో స్నేహబంధాలు పెంపొందండటంతో పాటు, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. నిత్యం ఆటలు ఆడటంతో ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృడంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్లు రమణ, పాండు, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, వార్డు సభ్యులు రవి, సోమ్లా, లక్ష్మణ్, నాయకులు పంతూనాయక్, శ్రీనివాస్, టీకులాల్, క్రీడాకారులు, టోర్నీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.