మాడ్గుల,(ఆమనగల్లు)అక్టోబర్18 : యువత ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఎదిగి పదిమందికి ఆదర్శంగా నిలబడాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సూచించారు. సోమవారం మండలంలోని జర్పులతండాలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఏడు మంది లబ్ధిదారులకు మంజురైన వివిధ వాహనాలను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడే రంగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా అర్హులందరికి పథకాలు అందుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి, నాయకులు వరుణ్‌లు పాల్గొన్నారు.