చేవెళ్ల రూరల్, అక్టోబర్ 1 : సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని చన్వెల్లి, అనుబంధ గ్రామం ఇక్కారెడ్డి గూడ గ్రామంలో నూతన పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, పూర్తయిన సీసీ రోడ్ల శిలాఫలకాల ప్రారంభోత్సవం, పామెన గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, అల్లవాడ గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాల ప్రారంభం, జాలాగూడ గ్రామంలో పూర్తయిన కల్వర్టు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తదితర అభివృద్ధి పనులను సర్పంచ్లు పట్లన్నగారి పద్మ, అక్నాపురం మల్లారెడ్డి, యాలాల భీంరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అన్ని గ్రామాలకు తారు, సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలిచి సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శివప్రసాద్, ఎంపీటీసీలు మమతాభూపతిరెడ్డి, సత్యనారాయణ చారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు, సర్పంచ్లు నరహరిరెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకటేశం గుప్తా, సులోచనాఅంజన్గౌడ్, లావణ్యశంకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ప్రమోద్, నిరంజన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
పామెన గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎంపీటీసీ సత్యనారాయణ చారి, ఉప సర్పంచ్ సరళవిజయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు విజయ్ పాల్గొన్నారు.