రంగారెడ్డి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ‘అన్నదాత కష్టానికి ఫలితం దక్కే సమయం.. పంట చేతికొచ్చాక సంబురాల సంక్రాంతి వస్తుంది.. మున్ముందు ఉమ్మడి జిల్లాలో బంగారు పంటలు పండి, ప్రతి రైతు ఇంటా సిరులు కురువాలి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు, రంగవల్లులు, గాలి పటాల సందళ్లతో పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.
ఈ ఏడాదంతా రైతులకు శుభం జరుగాలని, అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నిండి భోగభాగ్యాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.