Shadnagar | షాద్నగర్టౌన్, ఏప్రిల్ 08 : షాద్నగర్ పట్టణంలోని శ్రీ గోదా సమేత లక్షీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ లక్షీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజాలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు శ్రీ లక్షీనరసింహ్మస్వామి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, నాయకులు పాల్గొని గరుత్మంతుడి పటంతో దేవాలయం చుట్టు ప్రదక్షణాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, అంతయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఒగ్గు కిషోర్, నాయకులు, భక్తులు సాయిశ్వర్రెడ్డి, బాల్రాజ్, భూపాల్, కుమార్, శేఖర్ పాల్గొన్నారు.
శ్రీ గోదాసమేత లక్షీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసినట్లు దేవాలయ అర్చకుడు శ్రీనివాసచార్యులు తెలిపారు. అనంతరం గరుత్మంతుడి పటంతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గరుత్మంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు. అదే విధంగా బుధవారం శ్రీ లక్షీవేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.