దోచుకోవడానికే పక్కాప్లాన్
‘ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ.. రూ.లక్షన్న కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నదని’ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మూసీ పోరుబాటలో భాగంగా ఉప్పల్, నాగోల్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు.
- మూసీపేరిట రూ.లక్షన్నర కోట్లకు రేవంత్ స్కెచ్
- మూసీ పోరుబాటలో గెల్లు శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ.. రూ.లక్షన్న కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నదని’ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మూసీ పోరుబాటలో భాగంగా ఉప్పల్, నాగోల్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. నాగోల్‌లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలని ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లవుతున్నా ఒక్క హామీ అమలు చేయలేదని ఎద్దేవా చేశా రు. రెండు లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని యువతులకు నమ్మకద్రోహం చేసిందన్నారు.
బస్తీలు, కాలనీల్లోని పేదల ఇండ్లను కూల్చి వారి భూములను లాక్కునే పనిలో రేవంత్ సర్కార్ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టకుండా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో అతితక్కువ ఖర్చుతో మూసీ సుందరీకరణ ఎలా చేసి చూపించారో పలు కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు గెల్లు శ్రీనివాస్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.లక్షన్న కోట్లతో సుందరీకరిస్తామని ప్రజాధనాన్ని దోచుకునేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నదని విద్యార్థులకు తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

