Geetha Vanajakshi | మొయినాబాద్, మార్చి13 : ఓ దళిత కుటుంబంలో పుట్టిన మహిళ ఉన్నత చదువులు చదివి, న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిలోనికి అడుగు పెట్టింది. గత కొన్నేండ్లుగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ గత పదేండ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఆమె సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏజీపీగా నియమితులై చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో తమ వృత్తిని కొనసాగించనున్నారు.
మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన గీతావనజాక్షి గత కొన్నేండ్లుగా న్యాయవాది వృత్తిని కొనసాగించుకుంటూ వస్తున్నారు. ఒక వైపు న్యాయవాద వృత్తిని కొనసాగించుకుంటూనే రాజకీయంగా అవకాశం రావడంతో గత పదేండ్ల క్రితం గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒక వైపు న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ మరో వైపు సర్పంచ్ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఏజీపీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడంతో ఆమె ఎంపికయ్యారు. చేవెళ్లలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు ఇతర కోర్టులకు అసిస్టెంట్ గవర్నమెంటు ప్లీడర్‌గా ఆమెను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చేవెళ్ల కోర్టులో 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం తరపున సివిల్ కేసులకు సంబంధించి ఆమె వాదించనున్నారు. ఓ దళిత కుటుంబంలో పుట్టి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏజిపిగా నియమితులు కావడంతో గ్రామస్తులు ఆమెకు ప్రసంశంలు కురిపించారు. గ్రామస్తులు సన్మానాలు చేసి ఆమెను అభినందించారు.