వికారాబాద్, సెప్టెంబర్ 1 : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు సహకరించాలన్నారు. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాటి వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని.. కల్వర్టులు, బ్రిడ్జిల దగ్గర రోడ్లు దాటేందుకు యత్నించొద్దన్నారు. పాత, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసించే వారు తక్షణమే వాటి నుం చి వచ్చి ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో ఆశ్రయం పొందాలన్నారు. కరెంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
కొడంగల్, సెప్టెంబర్ 1 : ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ఆదివారం ఆయన కొడంగల్‌లో పర్యటించి ఇబ్బందు లు తలెత్తిన ప్రాంతాలను పరిశీలించారు. పట్టణ శివారులోని గాడిబావి దగ్గరలోని కొడంగల్ పెద్ద చెరువుతోపాటు కాల్వ ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా బాలాజీనగర్ వీధిలోని వరదను, కోస్గి రోడ్డులో పర్యటించి వరద నీటి పరిస్థితులను సమీక్షంచారు. భారీ వర్షంతో నీటి ఉధృతి అధికంగా ఉందని.. అధికారులు అప్ర మత్తంగా ఉండాలన్నారు. రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు ఎస్పీ నారాయణరెడ్డి, తసీల్దార్ విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.