తుర్కయంజాల్,జూలై 15 : తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి ఇంజాపూర్ మాజీ సర్పంచ్ బొక్క మన్మోహన్రెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం బీఎన్‌రెడ్డిలోని మన్మోహన్రెడ్డి నివాసంలో ఆయన మృతదేహనికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాన్మోహన్రెడ్డి మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. మాజీ సర్పంచ్, మాజీ రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌గా ఆయన ప్రజలకు సేవలందించారని గుర్తు చేసుకున్నారు. తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ రొక్కం భీంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కందాడి లక్ష్మారెడ్డి, ఏనుగు ఆనంద్‌రెడ్డి, పలువురు నాయకులు మన్మోహన్రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.