రంగారెడ్డి, ఆగస్టు 5 (నమస్తేతెలంగాణ) : రాజకీయాల కోసం కాంగ్రెస్‌పార్టీ రైతు ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కాకమ్మ కబుర్లు చెబుతూ.. గోదావరి జలాలను వృథాగా కిందకు వదిలేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 90శాతం పూర్తిచేసిన పాలమూరు-రంగారెడ్డి కాల్వలు తవ్వటానికి కూడా పాలకులకు చేతులు రావటంలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 85 పిల్లర్‌లో కుంగిన రెండింటినీ సరిచేయాలని ఎంవీఎస్ఏ సూచించినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. మేడిగడ్డ బ్యారెజ్‌తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు స్టార్ట్‌చేస్తే గోదావరి జలాలు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్లతో పాటు అనేక రిజర్వాయర్లు, చెరువులు, నింపవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన పాలమూరు ప్రాజెక్టుకు మోటర్లను ఆన్‌చేస్తే కేసీఆర్ నిర్మించిన ఐదు భారీ రిజర్వాయర్లను నీటిని నింపుకుని కృష్ణా జలాలను వాడుకోవచ్చని ఆయన సూచించారు.
రైతులకు మేలు చేయటానికి చేపట్టవల్సిన చర్యలకు పాలకులు ముందుకు రావటంలేదని, గత కేసీఆర్ ప్రభుత్వంపై కక్షసాధింపు చర్యలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమీషన్ అంతా ఒక బూటకమని అన్నారు. తెలంగాణాను సస్యశ్యామలం చేసి రైతులకు సాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ నిర్మించిన పాలమూరు ప్రాజెక్టును తప్పుబట్టే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని ఆయన అన్నారు.
షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం నిర్మాణంపై పీసీఘోష్ కమీషన్ నివేదిక వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉందని అన్నారు. తుమ్మడి హట్టి వద్ద నీటి లభ్యత, కేంద్ర ప్రభుత్వ అనుమతులు సీడబ్ల్యూసీ సిఫార్సులు, నిపుణుల కమిటీ నివేదికలు, క్యాబినెట్ మినిట్స్ తదితరాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే కమీషన్ నివేదిక ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుందన్నారు.
కేసీఆర్‌ను, హరీశ్‌రావును వేధించటానికో, సాధించటానికో చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని, రైతులకు మేలుచేసే పనులు చేపట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా అధ్యక్షుడు సత్తువెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీలు జయమ్మ శ్రీనివాస్, కృపేశ్, మాజీ జడ్పీటీసీలు శ్రీలత, సత్యనారాయణ, దశరథనాయక్, సతీశ్, రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చంద్రయ్య, సురేందర్‌రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు భరత్‌కుమార్, సురేందర్, నాయకులు బుగ్గరాములు, రమేశ్, మోహన్‌రావు, జైపాల్‌రెడ్డి, రాజ్వర్ధన్రెడ్డి, సురేశ్, గౌతమ్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, లక్ష్మారెడ్డి, గౌస్‌పాషా, బహదూర్, భాస్కర్‌రెడ్డి, శివసాయి, రాజు, భరత్ పాల్గొన్నారు.