మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలుపించుకుందాం
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 23, 24, 25వ వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
- ఇంటింటికీ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్‌టౌన్, మే 3: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 23, 24, 25వ వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, ప్రజలకు మేలు జరుగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ పక్షాన ప్రజలు నిలబడాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పార్టీ నేతల మాయామాటలను నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. ఆరు గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీనీ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కరువు తాండవిస్తున్నదన్నారు.
రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్కు ఓటేసి బీజేపీ, కాంగ్రెస్ తగిన బుద్ధి చెపాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, నందీశ్వర్, జీటీ శ్రీనివాస్, రాజేశ్వర్, నాయకులు ఆకుల శ్రీశైలం, యాదవాచారి, వెంకటేశ్, సుధాకర్, యుగేందర్, శేఖర్, నందకిశోర్, యాదగిరి, సుధీర్, రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్, ఏజాజ్, అశోక్, శివాజీ, రాజశేఖర్, శరత్కృష్ణ, భాస్కర్ తదిరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

