వికారాబాద్, జూన్ 4 : బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినాన్ని ఆ పార్టీ నాయకులు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. వికారాబాద్ పట్టణంలో పార్టీ నాయకులు రోడ్లకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి దాదాపు 120 కార్లతో భారీ ర్యాలీ తీశారు.అనంతరం అనంతపద్మనాభస్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అక్కడి నుంచి ర్యాలీగా వికారాబాద్ ఆలంపల్లి దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తాలో, అలాగే పార్టీ కార్యాలయం వద్ద ఆనంద్‌ను బీఆర్ఎస్ నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నాణెలు, మామిడి పండ్లతో ఆనంద్‌కు తులాభారం వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్, అశోక్, జగదీశ్వరి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
విషెస్ చెప్పిన కేటీఆర్
ఆనంద్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. మీరు మరి న్ని విజయాలను సాధించా లని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.