మహేశ్వరం , డిసెంబర్ 1 : అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గోల్కొండ నుంచి కోళ్ల పడకల్ పోయే రెండు లైన్ల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పీఏసీఎస్ వైస్ చైర్మన్ దేవరపల్లి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గాదె థామస్ రెడ్డి, మాజీ సర్పంచులు బండారు లింగం ముదిరాజ్, మంత్రి రాజేశ్, రంగారెడ్డి వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ ఎంఎ సమీర్, రమేశ్, మల్లేశ్, శ్రీకాంత్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. రోడ్డు పనులు చేయించాలని ఆదేశించారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే ఎలా ప్రయాణం చేస్తారని అధికారులను ఆమె ప్రశ్నించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టాలన్నారు.