చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్, ఏప్రిల్ 22 : మాజీ హోంమంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవ లు మరువలేనివని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇంద్రారెడ్డి 25 వర్ధంతిని పురస్కరించుకుని చేవెళ్ల మండలంలోని కౌకుంట్లలోని ఇంద్రారెడ్డి సమాధి వద్ద కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డితో కలిసి సబితాఇంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంతకుముం దు ఇంద్రారెడ్డినగర్, చిట్టంపల్లిగేట్ వద్ద, చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని ఇంద్రారెడ్డి విగ్రహాలకు నివాళుర్పించారు. అనంతరం నాంచేరు గ్రామ రెవెన్యూలోని బీఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రారెడ్డి చిత్రపటానికి నివాళుర్పించారు. ఈ సందర్భం గా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ కెరటం, తెలంగాణ ఉద్య మం లో కీలక పాత్ర పోషించిన ఇంద్రారెడ్డి సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.
ఇంద్రారెడ్డి అందరి నుంచి దూర మై 25 ఏండ్లు కావొస్తున్నా ఇంకా ప్రజల గుం డెల్లోనే ఉన్నాడన్నారు. పేదల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. చేవెళ్ల ప్రాం త ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు, మా జీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంజన్‌గౌడ్, బీఆర్ఎస్ చేవెళ్ల, శంకర్పల్లి మండలాల అధ్యక్షులు ప్రభాకర్, గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్,
మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ప్రసాద్, కౌకుంట్ల, అంతా రం మాజీ సర్పంచ్‌లు సులోచన, గాయత్రి, నరహరిరెడ్డి, ప్రభాకర్, శివారెడ్డి, హన్మంత్‌రెడ్డి, జహంగీర్, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమల్ల ఆంజనేయు లు, ఎంపీటీసీ సత్యనారాయణచారి, చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు గిరిధర్‌రెడ్డి, నర్సింహులు, మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, సాయినాథ్, యాదగిరి, మాణిక్యం, మహేందర్‌రెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, భాసర్, శేరి రాజు, సుదర్శన్, వీరాజంనేయులు, రాము, నవీన్, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని సక్సెస్ చేద్దాం..
ఈనెల 27న వరంగల్‌లో జరుగనున్న బహిరంగ సభకు చేవెళ్ల నుంచి భారీగా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని సబితారెడ్డి పిలుపునిచ్చా రు. ఈ సందర్భంగా ఆమె కౌకుంట్లలో మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, ప్రజలు దండులా తరలివెళ్దామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపితే, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అట్టడుగుకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.