కడ్తాల్, సెప్టెంబర్ 22 : కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. 765 కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బాధిత రైతులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 15వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా బాధిత రైతులు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.
కాగా, దీక్ష చేస్తున్న రైతులకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పూలమాలలు వేసి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ..మండలంలో ఏర్పాటు చేయాలనుకున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్‌ను, షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి నేరుగా కందుకూరు మండ లంలోని నేదునూర్ గ్రామం మీదుగా మీర్ఖాన్పేటలోని పవర్ జంక్షన్‌కు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
15 రోజులుగా బాధిత రైతులు చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా ట్రిపుల్ఆర్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతం గా భూములను లాక్కుంటున్నదని మండిపడ్డారు. బడానాయకులు, పారిశ్రామికవేత్తల కు మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ ట్రిపులా ర్ అలైన్‌మెంట్‌ను మార్చిందన్నారు.
25న బీఆర్ఎస్ భవన్లో సమావేశం..
ట్రిపుల్ఆర్, గ్రీన్‌ఫీల్డ్ రహదారులు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్‌లైన్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న బాధిత రైతులతో.. ఈ నెల 25న తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమావేశం కానున్నట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తెలిపారు. కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు చెందిన భూనిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నా రు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మహేశ్, శ్రీనుగుప్తా, మహేశ్, రమేశ్, శ్రీకాంత్, సురేశ్, బాధిత రైతులు పెంటారెడ్డి, వెంకటేశ్, రాజేందర్‌యాదవ్, పాండునేత, రాఘవ, కృష్ణయాదవ్, గణేశ్, వెంకట్రాములుగౌడ్, శ్రీరాములుగౌడ్ రామకృష్ణ, పాండూనాయక్, శ్రీనూనాయక్ తదితరులు పాల్గొన్నారు.