పెద్దంబర్ పేట్, మార్చి 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని నారాయణ(Narayana) బాసర ఐఐటి క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్(Food poisoning) అవడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కుంట్లూరులోని నారాయణ బాసర క్యాంపస్ లో శనివారం రాత్రి ఆదివారం ఉదయం చపాతి, ఆలు కూర్మ తినడంతో పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మోషన్స్, వాంతులతో ఇబ్బందులు పడుతున్నారు.
కళాశాల యాజమాన్యం వైద్యులను తీసుకువచ్చి ఓఆర్ఎస్, కొబ్బరి బోండాలతో తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను చూసుకోనివ్వడం లేదని, పిల్లల దగ్గరకు వెళ్దామంటే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళా విద్యార్థినిలు కావడంతో వారిని మగ వైద్యులతో చూపిస్తున్నాడంతో తల్లిదండ్రులు అభ్యంతరం చెబుతున్నారు.