ONDC | ఓఎన్డీసీలో ఆర్డర్ చేద్దాం.. అధిక ధరలకు చెక్ పెడుదాం.. 2-3శాతం కమీషన్‌తోనే ఫుడ్ ఆర్డర్ ఇంటికి
ఇప్పుడంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడమే ట్రెండ్‌గా మారింది. ఒక్క క్లిక్‌తో కోరుకున్న ఆహారం ఇంటికొస్తుంది. నచ్చిన రుచులు దొరికే రెస్టారెంట్స్, హోటల్స్, ఐస్‌క్రీం పార్లర్స్ ఇలా ఎన్నో వాటి నుంచి అరగంట లోపరే అందుకుంటున్నం. రోజువారీ లైఫ్‌లో ఆన్లైన్ ఆర్డర్స్ సాధారణంగా మారిపోయింది.
- అదే స్విగ్గీ, జొమాటోలో 15-20 శాతం
ONDC | ఇప్పుడంతా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడమే ట్రెండ్‌గా మారింది. ఒక్క క్లిక్‌తో కోరుకున్న ఆహారం ఇంటికొస్తుంది. నచ్చిన రుచులు దొరికే రెస్టారెంట్స్, హోటల్స్, ఐస్‌క్రీం పార్లర్స్ ఇలా ఎన్నో వాటి నుంచి అరగంట లోపరే అందుకుంటున్నం. రోజువారీ లైఫ్‌లో ఆన్లైన్ ఆర్డర్స్ సాధారణంగా మారిపోయింది. అయితే ఈ ఆన్లైన్ ఆర్డర్స్‌లో ఓఎన్డీసీ (ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) అనే ఓ ఆప్షన్ ఉంది. స్విగ్గీ, జొమాటోలో మనం చేసే ఆర్డర్ విలువతో పోలిస్తే ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. కేవలం 2-3 శాతం లోపలే కమీషన్ ఛార్జీలు ఉంటాయి. స్విగ్గీ, జొమాటోల్లో 15-25 శాతం వరకు ఉన్నాయి. మనం ఓఎన్డీసీని వినియోగించుకోవాలనుకుంటే పేటీఎం ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో ఓఎన్డీసీ అని టైప్ చేస్తే చాలు. అందులో ఉండే సర్వీసులన్నీ ఓపెన్ అవుతాయి. ఫుడ్ సర్వీస్ ఓకే చేసుకుంటే అందులో ఉన్న లొకేషన్స్‌లో మనకు దగ్గరల్లో ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి.
అనంతరం ఆ లొకేషన్లో ఉన్న రెస్టారెంట్స్, హోటల్స్ దర్శనమిస్తాయి. వాటిని ఎంపిక చేసుకుని అందులో ఉన్న ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు మనం స్విగ్గీలో బంజారాహిల్స్‌లోని ద బిర్యానీ లైఫ్ అనే రెస్టారెంట్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ చికెన్ ఎంపిక చేసుకుందాం. దాని విలువ 319 రూపాయలతో పాటు డెలివరీ ఛార్జీ 28, జీఎస్టీ, రెస్టారెంట్ ఛార్జీ 39.90 రూపాయలు ఉంటుంది. మొత్తం 383 ఛార్జ్ చూపిస్తుంది. అదే రెస్టారెంట్ ఓన్డీసీలో అదే హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ ధర రూ.280.72గా ఉంది. అదనంగా డెలివరీ ఛార్జీ 23, టాక్సీ 15.95 ఉంటుంది. ఇందులో డిస్కౌంట్ కోడ్ ఐప్లెడ్ అంటూ రూ.25 మైనస్ అవుతుంది. అంటే మొత్తం ధర రూ.294.67గా ఉంటుంది. అంటే స్విగ్గీ ఆర్డర్‌కు ఓఎన్డీసీ ఆర్డర్‌కు సుమారు 80 రూపాయల తేడా ఉంటుంది అని సాంకేతిక నిపుణుడు మధు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, చాలా మందికి అవగాహన లేదని చెప్పాడు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

