పచ్చదనంతో ప్రకృతి రమణీయత
పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది.
- పచ్చదనం పరుచుకున్న కుర్మిద్దలోని పల్లెప్రకృతివనం
- గ్రామానికి కొత్త శోభ
- ఇతర గ్రామాలకు ఆదర్శం
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
యాచారం, మార్చి 13 : పల్లెలను పచ్చదనంగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సంవత్సరం లక్షలాది మొక్కలను నాటుతున్నది. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రకృతి రమణీయతను పంచుతూ గ్రామానికి కొత్తశోభను తీసుకొచ్చింది. అందులో ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పచ్చదనం, ఆహ్లాదంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నది. రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతున్నది.
ఈ ప్రకృతివనాన్ని సర్పంచ్ రాజశేఖర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్‌రెడ్డిలు తరచూ పర్యవేక్షిస్తున్నారు. ఇందులో వెయ్యికిపైగా వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొ క్కలను నాటి సంరక్షిస్తున్నారు. నిత్యం పంచాయతీ సిబ్బంది మొక్కలకు పల్లెప్రగతి ద్వారా కొనుగోలు చేసిన ట్యాంకర్‌తో నీటిని అందించడంతోపాటు ఎరువులు వేస్తుండటంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. వనం చుట్టూ కంచెతోపాటు పెద్ద ముఖద్వారం, మొ క్కల మధ్య నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పా టు చేశారు. గతంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుర్మిద్ద పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి నిర్వహణ బాగుందని అధికారులను అభినందించారు.
పచ్చదనాన్ని పెంపొందించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కుర్మిద్దలోని పల్లెప్రకృతివనం మండలంలోనే ఆదర్శంగా నిలవడం అభినందనీయం. గ్రామాల్లో ని హరితహారం నర్సరీలు, పల్లెప్రకృతివనాలు, బృహత్ ప్రకృతివనాల్లో నాటిన ప్రతి మొక్కనూ బతికించి పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలి. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి.
– విజయలక్ష్మి, ఎంపీడీవో యాచారం
మొక్కలు ఎండిపోకుండా చర్యలు
పల్లె ప్రకృతివనంలోని ప్రతి మొక్కనూ సంరక్షిస్తాం. వేసవిలో మొక్క లు ఎండిపోకుండా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో నీటిని అంది స్తాం. ‘పల్లె ప్రగతి’ పనులను దశల వారీగా పూర్తి చేసి గ్రామాన్ని ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– అనిల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, కుర్మిద్ద
ప్రతి మొక్కనూ సంరక్షిస్తాం
పల్లెప్రకృతి వనంలోని ప్రతి మొక్కనూ బతికిస్తాం. అన్ని మొక్కలను వృక్షాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నాం. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో నీటిని అందిస్తున్నారు. వనం చుట్టూ ప్రహరీ, ముఖద్వారం, రెండు గేట్లను ఏర్పాటు చేశాం. మొక్కల మధ్య నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశాం. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.
– బందె రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ కుర్మిద్ద
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Foest park
- love
- Nature
- Rangareddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

