రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అపోలో ఫార్మసీ అవుట్లెట్లలో వంద ఫార్మాసిస్టుల ఉద్యోగాల కోసం ఈ నెల 6న ఆన్లైన్ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి.జయశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులు డీ/బీ/ఎం ఫార్మసీ చేసి, 18 నుంచి 30 ఏండ్లలోపు వయస్సు ఉండాలన్నారు. పై పోస్టుల కోసం ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్ జాబ్‌మేళా, హైదరాబాద్, జూమ్ మీటింగ్ (మీటింగ్ ఐడీ:- 779 2645 9127, పాస్ కోడ్:- 123456)లో పాల్గొనాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 82476 56356, 90630 99306 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. మేళాలో ఎంపికైన వారు జిల్లా అంతటా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.