మహమ్మాయి.. దీవించమ్మా
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
- నేటి నుంచి మంగల్‌పల్లిలో ఉత్సవాలు
- వారం రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు
- ముస్తాబైన ఆలయం
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులు
ఆదిబట్ల, ఫిబ్రవరి 1 : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలు వందల ఏండ్లుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ ఉత్సవాలపై ప్రతి గ్రామంలో ప్రచారం చేశారు. వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల భక్తులతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గ్రామల నుంచి, హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రతి యేటా 10వేల నుంచి 15 వేల వరకు భక్తులు ఈ ఉత్సవాలకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వారం రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు..
మహమ్మాయిదేవి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, శనివారం కల్యాణోత్సవం, 5న రథోత్సవం, 6న త్రిశూలోత్సవం, 7న చక్రస్నానం (దీపోత్సవం) నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజు స్వామికి మహరుద్రాభిషేకం, శ్రీదేవికి కుంకుమార్చన, పూజలు, సేవలు, అభిషేకాలు, మహానైవేద్యము, అర్చనలు, హారతి ఆరాధన జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో వీధి నాటకాలతో భక్తులను ఆలరిస్తారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

