ఆదిభట్ల, ఏప్రిల్ 21 : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వండర్లా వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య ,కూతురుకు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదిభట్ల ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురకు చెందిన కొమ్మ గోని ప్రశాంత్ గౌడ్ (41) విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి పని చేస్తున్నాడు.
తన భార్య కుమ్మగొని వాణి, కొడుకు శ్రీతన్ (11) కూతురు శశికతో కలిసి తన బైక్పై వండర్ల నుండి సర్వీస్ రోడ్డు వెంట వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రశాంత్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా. కొడుకు శ్రీతన్ గౌడ్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రశాంత్ గౌడ్ భార్య, కూతురు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.