షాబాద్, జూన్ 2: రేపటి నుంచి గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ సూచించారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ అన్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి కార్యక్రమానికి సంబంధించి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యల పరిష్కరానికి చర్యలు చేపట్టిన్నట్లు తెలిపారు. మండలంలోని 25 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాని పేర్కొన్నారు.
ఈ నెల 3వ తేదీన పోలారం, బొబ్బిలిగామ, 4వ తేదీన రుద్రారం, కొమరబండ, 5న సోలీపేట్, కేశారం, 6న పోతుగల్, రంగాపూర్, 9న చందనవెళ్లి, మన్మర్రి, 10న బోనగిరిపల్లి, అంతారం, 11న హైతాబాద్, ఉబ్బగుంట, 12న మాచన్‌పల్లి, కక్కులూర్, 13న పెద్దవేడు, ఏట్ల ఎర్రవల్లి, 16న దామర్లపల్లి, రేగడిదోస్వాడ, 17న నాగరకుంట, తిర్మలాపూర్, 18న మద్దూర్, తాళ్లపల్లి, 19న షాబాద్, తాళ్లపల్లి, 20న షాబాద్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.