తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయింది. ఇటు రాష్ట్ర సర్కార్ నిరంతర విద్యుత్తు సరఫరా చేయదూ.. అటు వరుణులు కరుణించడూ..

చేసేదేమి లేక వేసిన మొలకెత్తిన మొలకలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వికారాబాద్ మండలం నారాయణపూర్లో ఓ రైతు మందుడబ్బాతో పత్తి మొక్కలకు నీళ్లు పడుతున్నారు. బొంరాస్పేట మండలంలోని తుంకిమెట్ల, రేగడిమైలారం గ్రామాల్లో తుంపర్ల పైపుల ద్వారా పంటలు ఎండిపోకుండా నీటి తడిని అందిస్తుండడం ‘నమస్తే తెలంగాణ’ కంటపడింది.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ