పరిహారం పెంచితేనే భూములిస్తాం..
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
- సీఎం ఇలాకాలో తేల్చి చెప్పిన రైతులు
- ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వాలని ప్యాలమద్ది, పెద్దనందిగామ రైతుల డిమాండ్
కొడంగల్, జూన్ 25 : మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూనిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఎకరాకు రూ.20 లక్షలు కాకుండా రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో సర్పంచ్‌లు యాసరోద్దిన్, చెన్బస్కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామసభలు నిర్వహించారు. కొడంగల్‌లో 75 మంది రైతులకు చెందిన 27ఎకరాల 20 గుం టలు, ప్యాలమద్దిలో 95 మంది రైతులకు చెం దిన 43 ఎకరాల 37 గుంటలు, పెద్దనందిగామ గ్రామంలో 75 మంది రైతులకు చెందిన 39ఎకరాల 20 గుంటలను సేకరిస్తున్నట్టు అధికారు లు చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నష్టపరిహారాన్ని పెంచితే తమ భూములను ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.20 లక్షలు చెల్లిస్తే భూమితో పా టు ఉపాధినీ కోల్పోతామన్నారు. ఇతర ప్రాం తాల్లో భూమిని కొనాలంటే రూ.80 లక్షలకు పైగా ధర ఉన్నట్టు పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం రూ.80 లక్షలు చెల్లిస్తే మరో చోట భూమిని కొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తామన్నారు. లేదంటే భూములు కోల్పోయి ఉపాధి లేక.. నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి వస్తుందన్నారు. భూసేకరణలో అధిక మొత్తం లో భూమిని కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకం కెనాళ్ల పనులను పొలాల మధ్య నుంచి కాకుండా పొలాల అంచుల్లో చేపడితే మిగిలిన కొంత భూమిలోనైనా వ్యవసాయం చే సుకుంటామని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలపై దరఖాస్తులిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం
భూసేకరణలో భాగంగా రైతులు తమ సమస్య లపై దరఖాస్తులిస్తే వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. 30 రోజు ల వరకు రైతులు కొడంగల్ తహసీల్దార్, తాం డూరు ఆర్డీవో కార్యాలయాల్లో అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు. రైతులు అందించిన దరఖాస్తులను పరిశీలించి మరోసారి క్షేత్రస్థాయిలో సర్వేతోపాటు పరిశీలించడం జరుగుతుందన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కొడంగల్ నియోజకవర్గంలో 1400 ఎకరాల ను సేకరించడం జరుగుతుందని.. కెనాళ్ల నిర్మాణంతోపాటు ప్రతి 450 ఎకరాలకు ప్ర త్యేకంగా ట్యాంకులను ఏర్పాటు చేస్తారన్నారు. కొడంగల్ మండలంలోని కొడంగల్, ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో భూసేకరణకు సర్వే పూర్తి కాగా, అభిప్రాయ సేకరణకు సమావేశాలు నిర్వహిస్తున్నమన్నారు. మక్తల్ నుంచి బొంరాస్‌పేట వరకు 108 కిలోమీటర్ల దూరంగా కెనాల్ నిర్మా ణం జరగనున్నదని, 53 వేల ఎకరాలకు సాగునీరందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అనిత, తహసీల్దార్ రాంబాబు, కృష్ణమోహన్, శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డి, సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

