కడ్తాల్, సెప్టెంబర్ 30 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో తాతల కాలం నుండి సాగు చేస్తున్న పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చి న్యాయం చేయాలని బాధిత రైతులు అన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ.. కడ్తాల్ మండల కేంద్రంలో బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 23వ రోజు మంగళవారం చేపట్టిన దీక్షలో కృష్ణయాదవ్, శ్రీరాములుగౌడ్, రాములుయాదవ్, రాందాస్‌నాయక్, యాదయ్య కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారికి పలువురు నాయకులు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైటెన్షన్ విద్యుత్‌లైన్‌తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని తెలిపారు. విద్యుత్‌లైన్ ఏర్పాటుతో భూముల ధరలు తగ్గిపోవడంతోపాటు క్రయవిక్రయాలు జరగవన్నారు. విద్యుత్‌లైన్ ఏర్పాటుతో మండల అభివృద్ధికి అటంకంగా మారుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌లైన్ అలైన్‌మెంట్‌ను మార్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, రైతులు సీహెచ్.మహేశ్, కేశవులుగౌడ్, వీరరాఘవులు, రాజేందర్‌యాదవ్, పెంటారెడ్డి, పర్వత్కుమార్యాదవ్, వెంకట్రాములుగౌడ్, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.