కడ్తాల్, జనవరి 30 : అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తలకొండపల్లి-షాద్‌నగర్ రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నా యకులు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రైతులను దగా చేస్తున్నదని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. దానిని రూ.12 వేలకు కుదించిందన్నారు. ఈ సర్కార్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని.. అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నదన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయిలో పంట రుణాల మాఫీ కాలేదన్నారు. ఆందోళనలో మాజీ జడ్పీటీసీ నర్సింహముదిరాజ్, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ శ్రీశైలంయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్లు శేఖర్‌యాదవ్, యాదయ్య, పాండుయాదవ్, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పాండు, కృష్ణ, నర్సింహ, మల్లేశ్, గణేశ్, లక్ష్మీకాంత్, శంకర్‌నాయక్, వెంకటాచారి, ప్రవీణ్, చెన్నయ్య, సాల య్య, బాబయ్య, బాలరాజు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.