పరిగి, సెప్టెంబర్ 12 : యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పరిగి పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉద యం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు ఒకటి, రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మండల కేంద్రంలోని తెలంగాణ ఆగ్రో రైతు సేవా కేంద్రం -2 వద్ద శుక్రవారం రైతులు ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాశారు. గం టల తరబడి క్యూలో నిరీక్షించినా తమకు సరిపడా యూ రియా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కా ర్ యూరియా సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు.
12కెసిఎల్01: కులకచర్ల ఆగ్రో సేవా కేంద్రం ముందు యూరియా కోసం వేచిఉన్న రైతులు
యురియా కోసం బారులు
కులకచర్ల : మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఎదుట రైతులు యూరియా కోసం బారులుతీరారు. ఎరువు కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర నియోజకవర్గాల్లో యూరియా ఎక్కువ మొత్తంలో వస్తున్నదని.. పరిగి నియోజకవర్గానికి మాత్రం యూరియా తక్కువగా వస్తుందని.. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించి యూరియా కొరతను తీర్చాలని కోరారు.