రంగారెడ్డి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రో డ్డు ఏర్పాటుతో నష్టపోనున్న భూబాధితుల్లో రోజురోజుకూ నిరసన జ్వాలలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతోపాటు పరిహారం విషయాన్ని తేల్చకుండానే భూముల్లో సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తుండడంతో బాధితులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట సమీపంలో నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభు త్వం ఓఆర్ఆర్ నుంచి ట్రిఫుల్‌ఆర్ వరకు రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి కొంగరకలాన్, రావిర్యాల, ఫిరోజ్‌గూడ నుంచి మీర్ఖాన్పేట వరకు 18 కిలోమీటర్లకు 440 ఎకరాలు, 300 ఫీట్ల రోడ్డును వేస్తున్నారు. అలాగే, మీర్ఖాన్పేట్ నుంచి ఆకుతోటపల్లి వరకు 22 కిలోమీటర్ల రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సుమారు వెయ్యి ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించగా.. 4,7 25 మంది రైతులు భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూమికి భూమి ఇవ్వాలి : రైతులు..
ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూమికి బదులు తయకు మరో చోట భూమిని ఇవ్వాలని.. లేకుంటే భూములకున్న విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేద ని.. అవసరమైతే ప్రాణాత్యాగానికైనా సిద్ధమని తేల్చి చెబుతున్నారు. సర్వే ప్రారంభించిన రోజే కొంగరకలాన్‌లో రైతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. పరిస్థితిని తెలుసుకున్న ప్రభుత్వం పెద్ద ఎత్తు న పోలీసులను మోహరించి సర్వే నిర్వహించింది. సర్వే కంటే ముందు రాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలతో రోడ్డు సర్వే చేపట్టింది.
సర్వేను అడ్డుకుంటున్న రైతులకు సరైన పరిహారం చెల్లించిన తర్వాతే.. సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఆ విషయాన్ని తేల్చకుండానే సోమవారం నుంచి హద్దురాళ్లు పాతే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కలెక్టరేట్ సమీపం నుం చి రావిర్యాల భూముల్లో హద్దురాళ్లు ఏర్పాటు చేస్తుండగా.. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికెళ్లి అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే హ ద్దురాళ్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పి.. అక్కడి నుంచి రైతులను పంపించేశారు. దీంతో ఆందోళన చెందిన రైతులు కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకోవడంతో.. ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తిరిగి వెనక్కి పంపించారు.
పరిహారాన్ని తేల్చాలి..
తమ భూములపై పరిహారం విషయాన్ని ప్రభుత్వం తేల్చకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి భూములను లాక్కు ని తమను రోడ్డు పాలు చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొంగరకలాన్‌కు చెందిన రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేయ గా.. అలాగే, రావిర్యాల గ్రామానికి చెందిన రైతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు.
తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, లేదా, భూమికి భూమి ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండింటిలో దేనికి ప్రభుత్వం అంగీకరించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.