కల్వకుర్తి రూరల్, నవంబర్ 29: గురువారం జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల నుంచి నియోజకవర్గంలోని మండలాలకు పోలిం గ్ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎం, వీవీప్యాట్లను తీసుకు ని వెళ్లారు. బుధవారం ఉదయం 9గంటల నుంచి ఆర్వో శ్రీను ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ నిర్వహించేటప్పుడు పాటించాల్సిన నియమాలు, సలహాలు సూచనలు జారీ చేశారు. ఆరు మండలాల్లో మొత్తం 262 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించారు.
గురువారం ఉదయం ఆరు గంటల నుంచి 7గంటల వర కు ఈవీఎంల మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించిన అనంతరం గ్రామస్తులు ఓటు వేసేందుకు అనుమతించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళి ప్రకారం సిబ్బంది నడుచుకోవాలని ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులకు తెలిపారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పనితీరు సిబ్బంది చేయాల్సిన విధులను ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటిం గ్ విధానం తెలుసుకునేందుకు వెబ్‌క్యామ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నట్లు దీనికై ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు వేసేందుకు వెళ్లే ప్రతిఒక్కరూ ఏదేని గుర్తింపు కార్డుతో (ఆధార్, పాన్, డైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఈజీఎస్ జాబ్‌కార్డు) పోలింగ్ స్లిప్‌తో పాటుగా కేంద్రానికి వెళ్లాలన్నారు. ఓటర్లు పోలింగ్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎన్నికల సామగ్రి తరలింపు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రీతమ్ సింగ్ పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి అందించిన సామగ్రిని పరిశీలించి వారితో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని సూ చించారు. కార్యక్రమంలో డీఎస్పీ పార్థసారథి, పోలీస్ సిబ్బంది ఆయాశాఖల అధికారులు ఉన్నారు.