సిటీబ్యూరో, సెప్టెంబరు 21 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొలిరోజు ఆదివారం (ఎంగిలి పూల బతుకమ్మ) గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండగగా సాగింది.‘ చిత్తూ చిత్తూల బొ మ్మ..శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ మ హిళలు ఆడిపాడారు. స్థానికంగా ఉండే ఆలయాలకు మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మను నెత్తిన పెట్టుకొని రావడంతో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తం గా 384కి పైగా బతుకమ్మ కుంటలు,చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులను జీహెచ్ఎంసీ సిద్ధ్దం చేసింది.
ప్రజల సౌకర్యార్థం 82 తాత్కాలిక మరుగుదొడ్లు, 45వేల తాత్కాలిక విద్యుత దీపాలు ఏర్పా టు చేశారు. వేడుకలు జరుగుతున్న ప్రదేశాలలో 1,450 శానిటేషన్ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన వేడుకల వేదికలు పీఫుల్ ప్లాజా-నెక్లెస్‌రోడ్, ఎల్భీ స్టేడియం, జల విహార్, కాప్రా చె రువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్‌నగర్ చె రువు, చార్మినార్, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ముషీరాబాద్, బేగంపేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో తొలి రోజు సందడి కనిపించింది. మహిళా సంఘాలు, వలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో బతుకమ్మ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో మరింత ఉత్సాహభరితంగా సాగాయి.