MLA Marri Rajashekhar Reddy | నేరేడ్మెట్, మార్చి 5: మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చొరవతో గౌతంనగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో సుమారు కోటి రూపాయాల నిధులతో నూతన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాముయాదవ్ తెలిపారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని చలపతి రెసిడెన్సీ దగ్గర 100 కేవీఏ, గోపాల్‌నగర్ గణేష్ టెంపుల్ దగ్గర 100 కేవీఏ, అన్నపూర్ణ హౌసింగ్ సొసైటీ దగ్గర 100 కేవీఏ, మిర్జాల్‌గూడ 100 కేవీఏ తదితర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, మరమ్మతులు నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గౌతంగనగర్ డివిజన్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నూతన స్తంభాలు, విద్యుత్ మరమ్మతులు కోసం సుమారు కోటి రూపాయలు మంజూరు చేసినందుకు మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, విద్యుత్ ఏడిఈ చంద్రశేఖర్లకు స్థానిక కార్పోరేటర్ మేకల సునీత రాముయాదవ్, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.