Electrician Dies | కొత్తూరు, ఫిబ్రవరి 15: వినాయక స్టీల్ పరిశ్రమలో ట్రాన్స్ఫార్మర్పై నుంచి పడి ఓ ఎలక్ట్రిషియన్ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం 45 రోజుల క్రితం ఒడిశా రాష్ట్ర వాసి ప్రీతంకుమార్ (19) కొత్తూరుకు వచ్చాడు. న్యూ భరత్‌నగర్‌లో నివాసం ఉంటూ వినాయక స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే శనివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. దీంతో అతని మూతి, ముక్కుకు బలమైన గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స కోసం హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రీతంకుమార్ అక్కడి డ్యూటీ డాక్టర్ పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించాడు. మృతుడు ప్రీతం కుమార్ తండ్రి విద్యాధర బెహర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.