Electric Pole | నందిగామ, మే 04 : నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది. దీంతో నమస్తే తెలంగాణ దిన పత్రికలో శనివారం పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ కథనంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఆదివారం విరిగిన విద్యుత్ స్తంభం తొలగించి నూతన స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో జంగోనిగూడ, పృథ్వి కాలనీ ప్రజలు, వాహనదారులు సంతృప్తి వ్యక్తం చేసి నమస్తే తెలంగాణ దినపత్రికకు, విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.