కేశంపేట, అక్టోబరు 26 : అఖిల భారత యాదవ హక్కుల సాధన సమితి కేశంపేట మండల నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘం తాలూకా అధ్యక్షుడు నడికుడ యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల అధ్యక్షుడిగా బొజ్జం శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా మల్లేశ్, కార్యదర్శిగా లింగం, సభ్యులుగా మల్లేశ్, అమ్రేశ్, దశరథ, గోపాల్, శేఖర్, రమేశ్, శ్రీనివాస్, మహేశ్, మల్లేశ్, శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నడికుడ యాదగిరియాదవ్ మాట్లాడుతూ యాదవులు విద్యా, ఉద్యోగం, ఆర్థిక రంగాల్లో ప్రగతి సాధించాలన్నారు. పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న యాదవ సోదరులకు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా బొజ్జం శ్రీశైలం మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష్య పదవిని కట్టబెట్టిన సంఘం సభ్యులకు రుణపడి ఉంటానని, యాదవ సామాజిక ప్రగతికోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కమిటీ యాదవుల హక్కుల సాధనకోసం పాటుపడుతుందన్నారు.