షాబాద్, మే 3: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి రాంబాబు యాదవ్, షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండలంలోని అప్పారెడ్డిగూడ, మన్మర్రి, బోడంపహాడ్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల క్రితం తెలంగాణలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేశారన్నారు. రైతుబంధు కింద రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ గూడూరు సరళ, సహకార సంఘం డైరెక్టర్ నర్సింహులుగౌడ్, మాజీ సర్పంచులు పూజిత, కృష్ణారెడ్డి, దర్శన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సత్యం, జగ్గారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆరీఫ్, యాదయ్య, చెన్నయ్య, యాదిరెడ్డి, లక్ష్మి, నరేశ్, నర్సింహులు, రవి, మల్లేశ్, మునీర్, శివ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. శుక్రవారం మండల పరిధిలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు రాజు, ఎంఏ రావూఫ్, జిల్లా నాయకులు గణేశ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు పరమేశ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ముజ్జు, మీడియా సెల్ మండల అధ్యక్షుడు సుభాష్, నాయకులు కృష్ణమాచారి, రామచందర్, చెన్నయ్యయాదవ్, అంజయ్యగౌడ్, నవీన్‌కుమార్, భిక్షపతిగౌడ్, శంకర్, రమేశ్‌చారి, షాబాద్ ప్రవీణ్, జయవర్దన్, సందీప్, రాజు పాల్గొన్నారు.
చేవెళ్లరూరల్ : మండల పరిధిలోని ఈర్లపల్లి, ఎన్కేపల్లి, కమ్మెట ఎక్స్ రోడ్డులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మెజార్టీలో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మర్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, వ్యసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీలచింటూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు సులోచనాఅంజన్గౌడ్, స్వర్ణలతాభాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు మహేశ్, అబ్దుల్ ఘని, నాయకులు రామాగౌడ్, విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ యువజన విభాగం చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, నాయకులు శేరి రాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.