Moinabad | మొయినాబాద్, ఏప్రిల్ 19 : ఈదురుగాలులు వీచినప్పుడు, వర్షాలు కురిసినప్పుడు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగులుతుండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో చెట్ల కొమ్మలను తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించారు. దీంతో ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని విజయనవ్య ఫీడర్ 11 కేవీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సురంగల్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. కావున మొయినాబాద్‌లోని ముస్తాఫా హిల్స్, దుంపగడ్డ, సురంగల్‌లోని క్వార్టర్స్ బ్రీజీ ఫామ్స్, అమ్దాపూర్ రోడ్డులోని ఇండస్ట్రీయల్ ఏరియా, ఫామ్ హౌస్‌లకు కూడ విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.