ఇబ్రహీంపట్నం, జనవరి 12 : బీఆర్ఎస్ను రాష్ట్రంలో మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే పారదర్శక పాలన అందుతుందని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన 110మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇబ్రహీంపట్నంలోని బాలాజీగార్డెన్లో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్ల పెండ్లిచేయాలంటే తల్లిదండ్రులకు భారంగా మారిందని, అలాంటి తరుణంలో ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల వివాహాలు కష్టం కాకూడదన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారుగా రూ.140కోట్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించటంతో పాటు గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లను అభివృద్ధి చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయకమిటీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, కొత్త ఆర్తిక, వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో జైరాంవిజయ్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు
గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి రూ.9.48కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు వెలువరించిందని చెప్పారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్‌మెట్ 18గ్రామపంచాయతీలకు 1.98కోట్లు, ఇబ్రహీంపట్నం మండలంలోని 14 పంచాయతీలకు రూ.2.71కోట్లు, మంచాల మండలంలోని 23పంచాయతీలకు రూ.2.20కోట్లు, యాచారం మండలంలోని 24గ్రామపంచాయతీలకు రూ.2.59కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రమణారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, జిల్లాపరిషత్ కోఆప్షన్ సభ్యుడు అక్బర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, బుగ్గరాములు, రమేష్‌గౌడ్, రమేశ్ పాల్గొన్నారు.
దళితబంధుతో దళితుల అభ్యున్నతి
ఇబ్రహీంపట్నంరూరల్ : దళితబంధు పథకంతో పేదదళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండరావిరాలకు చెందిన చెవిటి, మూగ తనాలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన దాతరపల్లి కృష్ణ తన తండ్రిని కోల్పోయిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి దళితబంధు కింద ట్రాక్టర్ మంజూరు చేయించారు. ఆ ట్రాక్టర్‌ను గురువారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఆవరణలో అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, ఎంపీటీసీ అనిత, నాయకులు దనేష్, జంగయ్య, అర్జున్, నర్సింహ, శంకర్, రత్నం, ప్రవీణ్, దేవరాజ్, దయాకర్ ఉన్నారు.